ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్టుబడి ఆకాశమంతా... దిగుబడి కనపడనంత - farmers protest news in krishna district

ఒకవైపు ముంచెత్తిన వరదలు... మరోవైపు భరించలేని పెట్టుబడుల మధ్య మెుక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

farmers protest for heavy floods in krishna district

By

Published : Nov 16, 2019, 7:35 PM IST

మెుక్కజొన్న రైతుల ఆవేదన

మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పడిపోవటంతో... రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లభించింది. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు ఖరీఫ్​లో మొక్కజొన్న సాగు చేశారు. వారంరోజుల క్రితం మెుక్కజొన్న క్వింటాకు రూ.2,200 ధర పలికింది. ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్​గా మారి రూ.1500 మించి కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.1700 పైగా ఉండగా... వ్యాపారులు ఆ ధర కంటే తక్కువగా కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోగా... ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ధరలతో పోలిస్తే... ఖర్చులైన రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి క్వింటాకు రూ.2వేల చొప్పున కొనుగోలు చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: సిక్కోలులో భారీ వర్షాలు... మొక్కజొన్న రైతులకు కష్టాలు

ABOUT THE AUTHOR

...view details