కృష్ణా జిల్లా కంచికచర్లలోని సుబాబుల్ డంపింగ్ యార్డ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తాము తీసుకొచ్చిన సుబాబుల్ కర్రను దిగుమతి చేసుకోకుండా... దళారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి... ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర రూ.4400 కాగా... రైతుకు కేవలం రూ.2200 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పేపర్ కంపెనీ నిర్వాహకులు... రైతుల నుంచి రవాణా ఖర్చుల నిమిత్తం టన్నుకు రూ.650 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
కంచికచర్లలో సుబాబుల్ రైతుల ఆందోళన - కంచికచర్లలో సుబాబుల్ రైతుల ధర్నా వార్తలు
దళారులు ఇబ్బంది పెడుతున్నారంటూ.. కంచికచర్ల సుబాబుల్ డంపింగ్ యార్డ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.
పోలీసులతో మాట్లాడుతున్న సుబాబుల్ రైతులు