అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 524వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, వెంకటపాలెం, అనంతవరం, బోరుపాలెం, నెక్కల్లు, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల్లోరైతులు నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వం సమయానికి కౌలు వేయకపోవడం వల్ల కూలీపనులకు వెళ్తున్నామని రైతులు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి సర్వం కోల్పోయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కౌలు డబ్బులు చెల్లించాలని రాజధాని రైతుల విజ్ఞప్తి
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు 524వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం సమయానికి కౌలు చెల్లించకపోవడం వల్ల కూలీ పనులకు వెళ్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి రైతుల ధర్నా
ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు డబ్బులు చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధాని వాసులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో లేదని చెప్పారు
ఇదీ చూడండి.ఎల్లో ఫంగస్ వ్యాప్తి.. యూపీలో తొలి కేసు