కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, మైలవరంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వరి పొలాల్లోకి నీరు చేరింది. దీంతో పంటలు పాడయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కాయలు కుళ్లిపోయే దశకు చేరాయన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు - crop loss in krishna
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిశాయి. వరద ప్రవాహం ఊర్లనీ, పంట పొలాలనీ ముంచెత్తింది. కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో చేలు, పంట పొలాలు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు.
పత్తి చేనులో నిలిచిన వాన నీరు
నాలుగు మండలాల్లో 28 వేల ఎకరాల్లో వరి, 16,000 ఎకరాల్లో పత్తి, 600 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారని అధికారులు తెలిపారు. జి.కొండూరులో ప్రాథమిక పంట నష్టం కింద 213 హెక్టార్లు వరి, 77 హెక్టార్లు పత్తి నమోదు చేసినట్లు వ్యవసాయాధికారి వెల్లడించారు. ఇప్పటివరకు కురిసిన వర్షాలకు భారీ నష్టం లేకపోయినా.. మళ్లీ వస్తే పెట్టుబడులు వృథా అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి