ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేలాడుతున్న యమపాశాలు.. ఆందోళనలో రైతులు - current wires in fields

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పొల్లాలో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. రైతులకు ఆటంకం కలిగిస్తున్నాయి.

krishna distrct
వేలాడుతున్న యమపాశాలు.. ఆందోళనలో రైతులు

By

Published : May 11, 2020, 3:21 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో వాటర్ ట్యాంకు లిఫ్టింగ్ పంపు హౌస్ కు వెళ్లే దారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. ప్రాణాపాయంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. భూమికి కేవలం 6 అడుగుల ఎత్తులో ఉన్న తీగలు.. కాస్త పొడవైన వారికి చేతికి తగులుతున్నాయి.

పొలంలో దుక్కులు దున్నుకోటానికి, వరిగడ్డి తోలుకోటానికి అడ్డు తగులుతున్నాయి. పశువుల కోసం రైతులు పచ్చిగడ్డి నెత్తిమీద పెట్టుకుంటే వారికి తీగలు తగిలే ప్రమాదం ఉంది. ఏడాది నుంచి విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినప్పటికి తీగలు సరిచేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details