ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాము కాటేస్తే నేరుగా ఆసుపత్రికే రండి.. నాటు వైద్యం వద్దు'

కృష్ణా జిల్లాలో రైతులు పాముకాటు బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో పనులకు వెళ్తున్న వారే ప్రమాదానికి గురవుతున్నారు.

By

Published : Jul 15, 2020, 7:12 PM IST

snake bite
పామర్రులో పాముకాటుతో రైతులు బెంబేలు

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో రైతులను పాముకాటు ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే సుమారు నలభై మంది రైతులు పాముకాటుకు గురయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో.. పొలం పనులకు వెళ్తున్న రైతులు పాముకాటుకు గురతుండంపై.. బాధిత ప్రాంతాల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రైతులు, రైతు కూలీలు పాముకాటుకు గురైతే ఆందోళన చెందవద్దని మెువ్వ పీహెచ్​సీ వైద్య అధికారి శొంఠి శివరామకృష్ణరావు చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాము కరిచిన వెంటనే ఆసుపత్రికే రావాలని... నాటు వైద్యాన్ని ఆశ్రయించవద్దని కోరారు.

ABOUT THE AUTHOR

...view details