రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పద్ధతిలో తుళ్లూరు మండలంలోని గ్రామాల్లో రైతుల నుంచి సీఆర్డీఏ భూములు తీసుకుని గత మూడు సంవత్సరాలుగా కౌలు డబ్బులు చెల్లించింది. అయితే 2018 సంవత్సరానికి సంబంధించి పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదని... వెంటనే అవి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ రాజధాని ప్రాంతీయ ప్రాధికార సంస్థ కార్యాలయం ఎదుట కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత రైతులు ఆందోళన చేపట్టారు. 2018 సంవత్సరానికి సంబంధించిన కౌలు పరిహారంతో పాటుగా ఎకరాకు 1450 గజాలకు సమాన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ సీఆర్డిఏ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
''భూములు ఇచ్చిన దళిత రైతులకు కౌలు డబ్బులు తక్షణమే ఇవ్వాలి'' - capital framers dharna
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన లంక అసైన్డ్ దళిత రైతులు విజయవాడలో ఆందోళన చేపట్టారు. భూములు ఇచ్చిన తమలాంటివారికి కౌలు డబ్బులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
విజయవాడసీఆర్డీఏ కార్యాలయం ఎదుట లంక అసైన్డ్ దళిత రైతుల ఆందోళన