కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పత్తి పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో లక్షా 30 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా... నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లో అత్యధికంగా సాగు చేశారు. వర్షాల వల్ల కాయలు, పిందెలు, పూత పూర్తిగా రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి వస్తుందనే ఆశ లేకపోవడంతో కొంతమంది రైతులు పత్తి పైర్లు పీకేస్తున్నారు. కంచికచర్ల మండలం మోగులూరు, మున్నలూరు గ్రామంలో సుమారు 20 ఎకరాల్లో పత్తి పంటను తొలగించారు. దీంతో ఎకరానికి కౌలుతో కలుపుకొని 50 వేల వరకు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాడైన పంట.. పొలంలో నుంచి తొలగిస్తున్న రైతులు - పంటను తొలిగిస్తున్న రైతులు తాజా వార్తలు
ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు పొలంలో నుంచి పంటను పూర్తిగా తొలిగిస్తున్నారు. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో పంట చేతికి వచ్చే పరిస్ఠితి లేకపోవడం, ఇప్పటికే కాయలు కుళ్లిపోవడం, పురుగు బెడద ఎక్కువ కావడం వంటి కారణాలతో పంటను తొలగిస్తున్నట్లు రైతులు తెలిపారు.
పొలంలో నుంచి తొలిగిస్తున్న రైతులు