మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్రావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డులో రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. పంట అమ్మకాలపై కమీషన్ తీసుకోవటం భారంగా మారిందని రైతులు చెప్పారు. తక్కువ ధరకే విక్రయించాలని... లేకపొతే సరుకు తీసుకోమని వ్యాపారులు తిరస్కరిస్తున్నారన్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తాం - MLA Jagan mohan rao
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే జగన్ మోహన్రావు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే జగన్ మోహన్రావు