ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులను.. మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అప్పగించి చోద్యం చూస్తున్నారు' - రైతు సంఘం నేతలు తాజా వ్యాఖ్యలు

తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. తడిసిన, రంగుమారిన, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

Farmers Association leaders press meet
రైతు సంఘం నేతలు

By

Published : Jan 8, 2021, 5:04 PM IST

తడిసిన, రంగుమారిన, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. దాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. ఎకరాకు 40 వేల వరకు ఖర్చు చేసిన రైతులు.. వర్షాలు, తుపానుల కారణంగా తీవ్రంగా నష్టపోయారని కృష్ణా జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు అన్నారు. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చిన మంత్రులు.. చివరకు రైతులను మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అప్పజెప్పి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details