ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందని నీరు..ఎండిన పైరు.. అన్నదాతల ఆవేదన - Krishna district farmers news

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో 11 నెంబర్ కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయకపోవటంతో వందల ఎకరాల్లో వరినారుమడులు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. ఓ పక్క లక్షల క్యూసెక్కుల వరద నీరు బంగాళాఖాతంలోకి వృథాగా పోతున్నా... తమ పంట పొలాలకు మాత్రం నీరు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని కోరారు.

Farmers
అన్నదాతల ఆవేదన

By

Published : Aug 4, 2021, 2:04 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో 11 నెంబరు కాలువకు నీరు విడుదల చేయకపోవడంతో వందల ఎకరాల్లో వరినారుమడులు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి సంవత్సరం 11నెంబరు కాలువ కింద 7 వేల ఎకరాల వరి సాగు చేస్తారు. ఇప్పటికే సుమారు 2వేల ఎకరాల్లో వరినాట్లు వేసారు. 5వేల ఎకరాల్లో వర్షం మీద ఆధారపడి వేరే పంట సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా 11నెంబర్ కాలువకు మరమ్మతులు చేపట్టకపోవటంతో కాలువ గట్లు తెగి తెగిపోయాయి. అందువల్ల సగం కాలువకే నీరు విడుదల చేయటంతో చివరి భూములకు నీరు అందటం లేదని రైతులు వాపోయారు. లక్షల క్యూసెక్కుల వరద నీరు బంగాళాఖాతంలోకి వృథాగా పోతున్న.. తమ పంట పొలాలకు మాత్రం నీరు రావటం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని కోరారు.

ఇదీ చదవండి

పట్టణ ప్రజలపై ఏటా రూ.426 కోట్ల భారం!

ABOUT THE AUTHOR

...view details