ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదతో మిన్నంటిన రైతుల ఆవేదన

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల వాగులు, చెరువులు తెగిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి చేలు, అరటి, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

crop fields
రైతుల ఆవేదన

By

Published : Oct 14, 2020, 7:10 PM IST

మూడు రోజులుగా కురుస్తున్న వానల వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అన్నదాతే... అన్నమో రామచంద్ర అని దీనంగా చేతులు చాచుతున్న దుర్భరస్థితి నేడు నెలకొని ఉంది. నూజివీడు నియోజకవర్గంలో వరదల కారణంగా వరి, మొక్కజొన్న, పత్తి చేలు, అరటి, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికి అందే సమయంలో గాలి వానల కారణంగా నేలకొరిగాయి. రైతులు వాటిని కాపాడుకోవటం కోసం పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. వరి చేలలో పంటను నిలపెట్టినప్పటికీ ఎంతవరకు వరికంకులు దిగుబడినిస్తాయోననే అయోమయ స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నా నాలుగెకరాల్లోని వరి పూర్తిగా నేలమట్టమైంది. మా కుటుంబం మొత్తం వ్యవసాయంపై ఆధారపడి రేయింబవళ్ళు శ్రమించి పంటను కాపాడితే, కంకి దశలో నేలపై వాలింది: రైతు శంకు భాస్కర్ రావు (నరసాపురం గ్రామాం, చాట్రాయి మండలం)

రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలవాలి. మేము పూర్తిగా నష్టపోయాము: రైతు నాగరాజు

వరి కంకులు ఈనే దశలో ఉండగా పంట నేలను తాకడం, భారీ వర్షాలు కురవడం వలన నష్టాలను చవి చూడ వలసి వస్తోంది . అధికారులు పూర్తిస్థాయిలో విచారించి సన్న, చిన్న కారు రైతులమైన మమ్మల్ని రక్షించాలని వేడుకుంటున్నాము: మహిళా రైతు జొన్నలగడ్డ సామ్రాజ్యం

ఇదీ చదవండి:

'సమస్యలు పరిష్కరిస్తేనే సినిమా హాళ్లు తెరుస్తాం'

ABOUT THE AUTHOR

...view details