ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిల్లర్లు, దళారులు వల్ల రైతులు నష్టపోతున్నారు: దేవినేని ఉమ - Devineni Uma comments on ycp government

మిల్లర్లు, దళారులు వల్ల రైతులు నష్టపోతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలోని మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆయన ప్రశ్నించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 3 రోజులపాటు నిల్వ ఉంచుకొని తిప్పి వెనకకు పంపడంపై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవినేని ఉమ
దేవినేని ఉమ

By

Published : Jun 20, 2021, 5:14 PM IST

కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలోని మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని మాజీమంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. మిల్లర్లు, దళారులు వల్ల రైతులు నష్టపోతున్నారని, భార్య మెడలోని పుస్తెలు తాకట్టు పెట్టి ఆరుగాలం పండించిన పంటను దళారీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. హైవేకి దగ్గరలో ఉన్న ప్రాంతాలే దళారీలతో నలిగిపోతుంటే... ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి ఏమిటని..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కొన్నిరోజుల కిందట విసన్నపేట మిల్లర్ సూర్యనారాయణ రెడ్డిగూడెం మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని 3 రోజులపాటు నిల్వ ఉంచుకొని తిప్పి వెనకకు పంపడంపై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎందుకు దాన్ని వెనక్కి పంపుతున్నారని రైతులు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు అని తెలుసుకున్న మాజీమంత్రి దేవినేని... రెడ్డిగూడెంలోని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఇదీ చదవండీ... RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ

ABOUT THE AUTHOR

...view details