Farmers Agitation: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కృష్ణా జిల్లా జమిగోల్వేపల్లి గ్రామం వద్ద రైతులు రోడ్డెక్కారు. పామర్రు-గుడివాడ రహదారిపై బైఠాయించి రోడ్డును దిగ్బంధం చేశారు. రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు లేనిపోని నిబంధనలతో ఆంక్షలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కోసి 10 రోజులైనా కొనేవాళ్లు లేరంటూ ఆక్షేపించారు. దిగుబడికి సరిపడా సంచులు కూడా ఇవ్వట్లేదని వాపోయారు. ధాన్యం తరలించాల్సిన లారీలను రాత్రి నుంచి ఆపారని అవి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. రైతుల ఆందోళనతో పామర్రు-గుడివాడ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రైతులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు.
రోడ్డెక్కిన కృష్ణా జిల్లా రైతులు.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ
Farmers Agitation: కృష్ణా జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తుందని రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు చేయకుండా, ధాన్యం దిగుబడికి సరిపడా సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి లెేనిపోని ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల నిరసన
"ధాన్యం కోసి పది రోజులైనా కొనేవాళ్లు లేరు. సొసైటీలో దిగుబడికి సరిపడా సంచులు ఇవ్వట్లేదు. వడ్డీలకు తెచ్చి కౌలు చేసి నష్టపోతున్నాం. లారీలు రాత్రి నుంచి ఆపారు. రైతుల పైనే భారం వేస్తున్నారు." - రైతులు