కృష్ణా జిల్లా చందర్లపాడులో.. అప్పుల బాధ తాళలేక కట్టా లక్ష్మీనారాయణ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులు తీర్చే మార్గం కనపడకపోవడం వల్ల.. మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి పొలానికి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
అతను ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా.. అక్కడ లక్ష్మీనారాయణ మృతదేహం కనిపించింది. పొలంలో సూసైడ్ లేఖను సైతం గుర్తించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సీఎం జగన్ కు లేఖ రాసి బలవన్మరణం పొందాడు.