ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరివేసుకొని కౌలురైతు ఆత్మహత్య - తోట్లవల్లూరు నేర వార్తలు

అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

farmer suicide
ఉరేసుకొని కౌలురైతు ఆత్మహత్య

By

Published : Jan 26, 2021, 6:05 PM IST

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

గరికపర్రుకు చెందిన ఉయ్యురు కృష్ణ (55) మూడు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడికి అప్పులు తీసుకొచ్చాడు. సరైన దిగబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ నేపధ్యంలో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం నుంచి అతను కనబడటం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని దేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు తోట్లవల్లూరు పోలీసులకు తెలియజేయగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్ వికటించి ఇద్దరికి అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details