కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో వరదతో నష్టపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఉస్తేపల్లి, కాసరబాద, పొక్కునూరు, గుడిమెట్ల గ్రామాలలో పర్యటించిన ఆమె... అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్నదాత కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని సూచించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి ముంపుకు గురైన పంటలను పరిశీలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత, ప్రస్తుత సంవత్సరాల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
'వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - కృష్ణా జిల్లా నేటి వార్తలు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
వరదలతో ధ్వంసమైన పంటలను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య