ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలం పనులు చేస్తుండగా పాముకాటు.. రైతు మృతి - కొత్తమాజేరులో పొలం పనులు చేస్తున్న రైతును కాటేసిన పాము

పాము కాటుకు గురైన విషయాన్ని గమనించకపోవడం వల్ల ఓ రైతు మృతి చెందాడు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో.. తుమ్మా వెంకట నరసింహారావు పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. ఇంటికి వచ్చిన అనంతరం అతడు నురగలు కక్కతూ మరణించాడు.

farmer died with snake bite
పాముకాటుతో మృతి చెందిన రైతు

By

Published : Dec 11, 2020, 8:22 PM IST

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో పాము కాటుకు గురై.. తుమ్మా వెంకట నరసింహారావు అనే రైతు మరణించాడు. నిన్న పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసిన విషయం గమనించలేదు. సేద్యం పనులు పూర్తి చేసి ఇంటికి వచ్చి పడుకోగా.. రాత్రి 8 గంటల సమయంలో నురగలు కక్కుతూ పడిపోయాడు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details