ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిసెంబర్ 8న వ్యవసాయరంగ సంక్షోభంపై సదస్సు

దేశంలో వ్యవసాయ సంక్షోభానికి కారణాలు ఏంటి... అనే అంశంపై డిసెంబర్ 8న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడపత్రికను విజయవాడ ప్రెస్​క్లబ్​లో ఆవిష్కరించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-November-2019/5226728_253_5226728_1575117723949.png
Farmer Coolie Association meeting in vijayawada

By

Published : Nov 30, 2019, 6:19 PM IST

డిసెంబర్ 8న వ్యవసాయరంగ సంక్షోభంపై సదస్సు

డిసెంబర్ 8న విజయవాడలోని విజ్ఞాన కేంద్రంలో... రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సి తెలిపారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి గల కారణాలు రైతుల ఆత్మహత్యలు లేదా.. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెరుగుదల అనే అంశంపై ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన విత్తన చట్టం రూపంలో కార్పొరేట్లకు హక్కును కట్టబెట్టడం వంటి అంశాలపై చర్చిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను విజయవాడ ప్రెస్​క్లబ్​లో ఆవిష్కరించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ కొప్పుల కోటయ్య సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడారని చెప్పారు. ఆయన వర్ధంతి సందర్భంగా వ్యవసాయరంగ సంక్షోభంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఝాన్సి పేర్కొన్నారు. సదస్సులో వ్యవసాయరంగం రైతుల సమస్యలను విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: 'ఒక్కోరేషన్ కార్డుకు 3 కేజీలైనా ఇవ్వండీ సార్'

ABOUT THE AUTHOR

...view details