అప్పుల బాధతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పున్నవల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పోరుగంటి పుల్లారావు 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెడితే... అధిక వర్షాలతో దిగుబడి రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితిలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్లారావు బలవన్మరణానికి పాల్పడటంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - రైతు ఆత్మహత్య న్యూస్
కృష్ణా జిల్లా పున్నవల్లి గ్రామంలో పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధిక వర్షాలతో దిగుబడి రాకపోవటం... అప్పుల పాలవటంతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
![అప్పుల బాధతో రైతు ఆత్మహత్య farmer suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10109679-765-10109679-1609733994404.jpg)
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య