కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి.... వ్యవసాయ రంగాన్ని కాపాడాలని దేశ వ్యాప్తంగా 500 రైతు సంఘాలు నిరసన చేస్తున్నాయి. వారికి మద్దతుగా కృష్ణా జిల్లాలోని నందిగామ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్లే చిన్న, సన్నకారు రైతులను... వ్యవసాయానికి దూరంచేసి కార్పొరేట్ వ్యవసాయానికి ఆజ్యం పోయటమేనని రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల నాయకుల ధర్నా - నందిగామలో రైతు సంఘాల నాయకుల ధర్నా వార్తలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా... కృష్ణా జిల్లా నందిగామలో రైతు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఆ బిల్లుల కారణంగా రైతులకు అన్యాయం జరుగుతుందని రైతు సంఘాల నాయకులు ఆవేదన చెందారు.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల నాయకుల ధర్నా