కృష్ణాజిల్లా ఘంటసాల మండలం వి.రుద్రవరం గ్రామానికి చెందిన బోలెం వెంకటేశ్వరరావు(74) మూడేళ్ల క్రితం కుమారుడు చనిపోవడంతో చిలకలపూడిలో ఉంటున్నాడు. ప్రతి రోజులానే మేత కోసుకురావడానికి వెళ్లాడు. వెంకటేశ్వరరావు ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వెంబడి వెతికారు. పొలం గట్టుపై నిర్జీవంగా పడివుండటం చూసి బోరున విలపించారు. పక్కనే ఉన్న మోటర్ వైరు చేను గట్టుపై పడటంతో.. గడ్డితో పాటు వైరు కూడా కోయడంతో విద్యుత్ షాక్ కు గురై చనిపోయినట్లు తెలిసింది.
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి - Farm worker died by electric shock
విద్యుదాఘాతానికి గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిలకలపూడి గ్రామంలో జరిగింది.
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి