పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడుని ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సీఎస్ ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది. అవినీతి, అక్రమాలు, వేధింపుల ఆరోపణలపై చిన వీరభద్రుడునిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. కమిషనర్ బాధ్యత నుంచి తొలగించాలని కోరింది. విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తొలగించాలని కోరింది. విచారణ సమయంలో బాధ్యతలలో కొనసాగితే.. ఫిర్యాదుదారుడు ఉపాధ్యాయుడు అయినందున కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశముందని తెలిపింది. పలు హోదాలలో చిన వీరభద్రుడు పని చేసిన అన్ని శాఖలలోనూ విచారణ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య.. సీఎస్‌కు విజ్ఞప్తి చేసింది.
'పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పదవి నుంచి చిన వీరభద్రుడుని తొలగించండి' - ap secondary education commission
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడునిపై అవినీతి ఆరోపణల విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. కమిషనర్ బాధ్యత నుంచి తొలగించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సీఎస్ ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది.
!['పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పదవి నుంచి చిన వీరభద్రుడుని తొలగించండి' FAPTO letter cs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12442211-776-12442211-1626159773124.jpg)
FAPTO letter cs
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడునిపై అవినీతి, అక్రమాలు, వేధింపుల ఆరోపణలు వచ్చాయి. చినవీరభద్రునిపై విచారణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇంటర్ బోర్డు కమిషనర్‌ను విచారణ అధికారిగా నియమించారు.
ఇదీ చదవండి: