ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' సీఆర్పీఎఫ్ బెటాలియన్​ ర్యాలీ - అమర జవాన్ల కుటుంబ సభ్యులు

విజయవాడలోని చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్​ ర్యాలీ నిర్వహించింది. చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై గూడవల్లి నుంచి చిన్నఅవుటపల్లి 39వ బెటాలియన్ ప్రాంగణం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌

By

Published : Aug 28, 2021, 1:02 PM IST

సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో 'ఆజాది కా అమృత్ మహోత్సవ్​'లో భాగంగా వాకింగ్ ర్యాలీ నిర్వహించారు. 'ఫిట్​ ఇండియా ఫ్రీడమ్​'లో భాగంగా విజయవాడలోని చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై గూడవల్లి నుంచి చిన్నఅవుటపల్లి 39వ బెటాలియన్ బెటాలియన్​ ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు.

ఈ ర్యాలీలో మైలవరం, పురుషోత్తపట్నంకి చెందిన అమరవీరులైన జవాన్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని బెటాలియన్ కమాండెంట్ ఆర్.కె.పాండా, డిప్యూటీ కమాండెంట్ జె.ఎన్.మండల్, ఇతర అధికారులు సత్కరించారు. కార్యక్రమంలో బెటాలియన్ జవాన్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌: పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సత్కారం

ABOUT THE AUTHOR

...view details