కృష్ణాజిల్లా తిరువూరు చీరాల సెంటర్లోని ఓ అపార్ట్మెంట్లో కుటంబ సభ్యులతో కలిసి ఓ వృద్ధురాలు నివాసముంటోంది. ఆమె కరోనాతో చనిపోయిందని, వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ వెలుగోటి ఆది యూత్ సభ్యులకు కుటుంబసభ్యులు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వృద్ధురాలు బతికే ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
మంటగలిసిన మానవత్వం: బతికుండగానే కాటికి వృద్ధురాలు ! - కృష్ణా జిల్లా కరోనా వార్తలు
మానవసంబంధాలను కరోనా మంటగలిపేస్తోంది. అస్వస్థతకు గురైన ఓ వృద్ధురాలు చనిపోయిందని భావించిన కుటుంబీకులు ఆమెను కాటికి తీసుకెళ్లాలని స్వచ్ఛంద సంస్థను కోరారు. తీరా ఆమె బతికే ఉందని తెలిసినప్పటికీ... ఇంట్లోకి తీసుకెళ్లడానికి నిరాకరించారు. కానీ వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును ఇవ్వమని అడగడం వారి అమానవీయతకు అద్దం పడుతోంది.
మంటగలిసిన మానవత్వం... వృద్ధురాలిని బయటకు గెంటేసిన వైనం
బాధితురాలిని ఇంట్లోకి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించగా వారు నిరాకరించారు. కానీ వృద్ధురాలి మెడలోని బంగారు వస్తువులు ఇవ్వమని స్వచ్చంద సేవకులను కోరడం గమనార్హం. దీంతో చేసేదేమీ లేక బాధితురాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆస్పత్రిలో చేర్చారు.
ఇదీచదవండి.