కృష్ణాజిల్లా గుడివాడలో చిట్టీల వ్యాపారి ఐదు కోట్ల రూపాయలకు టోకరా వేసి పరారయ్యాడు. లక్ష్మణరావు, సత్యవతి దంపతులు గత కొంత కాలంగా వందమంది నుంచి సూమరు 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. రాత్రికి రాత్రే కుటుంబం మొత్తం పరారైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.
చిట్టీల పేరుతో టోకరా.. రూ.5 కోట్లతో ఉడాయింపు - crime news at gudiwada
కృష్ణాజిల్లా గుడివాడలో చిట్టీల పేరుతో మోసం చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేసి. తిరిగి చెల్లించకుండా టోకరా వేశాడు. రాత్రికి రాత్రే కుంటుంబం మొత్తం పరారైంది.
చిట్టీల పేరుతో టోకరా
తమను మోసం చేసిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల పెళ్లిళ్ల కోసం కొందరు.. సొంత గూడు నిర్మించుకుందామని మరికొందరు.. దాచుకున్న డబ్బులు సైతం చిట్టీలు కట్టామని.. వారు ఇలా అర్ధాంతరంగా డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ