కృష్ణా జిల్లా కైకలూరు మండలం అయోధ్యపట్నంలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులతోపాటు కుమారుడు గంగాధరరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గంగాధరకు ఏడాది క్రితం ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్వరితో వివాహమైంది. ''పెళ్లికి ముందే కోడలి ప్రవర్తన గురించి స్థానికంగా వ్యతిరేక అభిప్రాయాలు వినిపించినా... మా కుమారుడు ఇష్టపడిన కారణంగానే వివాహం చేశాం'' అంటూ.. తల్లిదండ్రులు బలరామకృష్ణ, సుబ్బలక్ష్మి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు. కోడలి వేధింపులు తాళలేక... తమ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక ఈ పని చేసినట్లు లేఖలో తెలిపారు.
విషాదం.. తల్లిదండ్రులు, కొడుకు బలవన్మరణం! - కుటుంబం ఆత్మహత్య
తల్లిదండ్రులతో కలిసి.. ఓ వ్యక్తి.. ఒకేసారి బలవన్మరణానికి పాల్పడ్డారు. కోడలి ప్రవర్తన తీరే తమ నిర్ణయానికి కారణమని వృద్ధ దంపతులు రాసిన లేఖను.. మృతదేహాల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![విషాదం.. తల్లిదండ్రులు, కొడుకు బలవన్మరణం!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4213384-201-4213384-1566490533398.jpg)
suicide
విషాదం.. తల్లిదండ్రులు, కొడుకు బలవన్మరణం!
10 రోజుల క్రితమే వచ్చిన గంగాధరరెడ్డి..
ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు... గంగాధరరెడ్డి ఉద్యోగరీత్యా సింగపూర్ లో ఉండేవారు. 10 రోజుల క్రితమే స్వస్థలానికి వచ్చారు. తల్లిదండ్రులతో కలిసి భార్య ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి.. బలవన్మరణానికి పాల్పడ్డట్టు స్థానికులు చెప్పారు. మృతదేహాల వద్ద లభించిన లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Aug 22, 2019, 11:07 PM IST