Fake Votes in Machilipatnam:ఒక బూత్ పరిధిలో ఓట్లు అక్కడే ఉండకపోతే ఏమైంది..? ఎక్కడో ఒక చోట ఉంది కదా..? అక్కడి కెళ్లి ఓటు హక్కు వినియోగించుకోలేరా..? అయినా వారి తరఫున మీరెందుకు వకాల్తా పుచ్చుకున్నారు..? మీ సమస్యలు ఉంటే చెప్పండి..? ఇదీ అన్ని రాజకీయ పార్టీలతో జరిగే సమావేశంలో.. ఓట్ల జంబ్లింగ్ గురించి ప్రశ్నించిన వారికి.. జిల్లా స్థాయి అధికారి నుంచి ఎదురైన సమాధానం. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో ఏ స్థాయిలో ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయో..!
Illegal Votes in AP: కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో.. దాదాపు ఓటరు జాబితా సవరణ పూర్తి కావస్తోంది. పోలింగ్ బూత్‌ల హేతుబద్దీకరణ ప్రతిపాదనలు కొలిక్కి వచ్చాయి. ఈ నెల 27న సమీకృత ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. దీనిపై మరోసారి డిసెంబరు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబరు 26కు అభ్యంతరాలు పరిష్కరించి.. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఈ జాబితాతోనే.. సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నారు.
Fake Votes in AP: వారం రోజుల్లో ఓటర్ల ముసాయిదా జాబితా.. అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండానే..!
Voters List Without Correction of Irregularities: డ్రాప్టు నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్నా.. బందరు నియోజకవర్గంలో సవరణ పూర్తి కాలేదు. ఈ విషయం ఎన్నికల సంఘం గుర్తించినా అధికారులు మాత్రం స్పందించకపోగా.. కనీస చర్యలు తీసుకోలేదు. ఇంటింటికి బీఎల్‌ఓలు తిరిగి సవరణ చేయాల్సిన ఓటర్ల జాబితా తప్పుల తడకలుగా ఉంది. వీటిని పర్యవేక్షించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు.
TDP Votes Deletion in AP: అక్టోబరు 10న నియోజకవర్గ ఎన్నికల అధికారిగా ఉన్న మచిలీపట్నం ఇంఛార్జ్ ఆర్డీఓ శివనారాయణ రెడ్డికి, బందరు ఎమ్ఆర్ఓ శ్రీవిద్యకు, కలెక్టర్ రాజాబాబుకు.. 24 గంటల్లో తప్పులు సరిదిద్ది నివేదిక ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దాదాపు 2వారాలు గడిచినా తప్పులు అలాగే ఉన్నాయి. టీడీపీ సానుభూతిపరుల లక్ష్యంగా కొన్ని ఓట్లను తొలగించగా.. కొన్ని జంబ్లింగ్ చేశారు. ఒకే వీధిలోని ఓట్లు వేరే ప్రాంతాల్లో చేర్చారు. దీనిపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర.. సీఈఓ ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. ఓట్ల గోల్‌మాల్, జంబ్లింగ్‌పై సామాజిక కార్యకర్త ఐ.దిలీప్‌కుమార్.. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.