క్రైమ్ రిపోర్టర్స్మంటూ లారీ డ్రైవర్లను బెదిరించి 27వేల రూపాయల నగదు కాజేసిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం..
ఈ నెల 9న తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గనిఆత్కూరు ఇసుక రీచ్ నుంచి బిల్లులతో చట్రాయి ఆర్వీఆర్ ప్రాజెక్టుకు ఇసుకను తరలిస్తున్నారు. పరిటాల సమీపంలో బైపాస్ వద్ద నాలుగు ఇసుక లారీలను ఇద్దరు క్రైమ్ రిపోర్టర్స్మంటూ ఆపారు. బిల్లులు చూపమన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. అధిక లోడుతో వెళ్తున్నారని బెదిరించారు. పోలీసులు తెలుసని చెప్పి.. వారి వద్ద నుంచి రూ.27వేల నగదు వసూలు చేశారు.