ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fake Currency: కలర్‌ ప్రింటర్​తో నకిలీ నోట్లు.. పోలీసుల అదుపులో నిందితులు - కృష్ణా జిల్లాలో నకిలీ నోట్లు

Fake Currency Seized: కృష్ణా జిల్లా పెడనలో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్, పేపర్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు.

కలర్‌ ప్రింటర్​తో నకిలీ నోట్లు
కలర్‌ ప్రింటర్​తో నకిలీ నోట్లు

By

Published : Dec 14, 2021, 10:00 AM IST

Fake Currency At Krishna District: కృష్ణా జిల్లా పెడనలో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్​, పేపర్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వీరభద్రాపురానికి చెందిన తండ్రీకుమారులు కాసా నాగరాజు, కాసా చందు గత కొన్ని రోజులుగా దొంగ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్నారు. రూ.లక్ష అసలు నోట్లకు..నాలుగు లక్షల దొంగనోట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. పెడనకు చెందిన కాసా వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరిని కలుపుకొని దొంగనోట్లను మార్కెట్​లో చలామణి చేస్తున్నారు.

ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కాసా నాగరాజు ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ కరెన్సీతో పాటు, జిరాక్స్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగరాజుతో సహా 9 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details