కృష్ణా జిల్లా విజయవాడలో నకిలీ సిగరెట్ల దందాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. బ్రాండెడ్ పేరుతో నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి అక్రమంగా బిహార్ నుంచి రాష్ట్రానికి రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు గుంటూరు జిల్లా మల్లికార్జున పేటకు చెందిన సూర వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.15 లక్షలు విలువ చేసే సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - విజయవాడ నకిలీ సిగరెట్ల అమ్మకం న్యూస్
విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న నకిలీ సిగరెట్ల దందాకు పోలీసులు చెక్ పెట్టారు. బ్రాండెడ్ పేర్లతో నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్