రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మండవల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కృష్ణా జిల్లా మండవల్లి, నెల్లూరు జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.2.5 కోట్ల నకిలీ చలానాలు అధికారులు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తోడేకొద్ది అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి.
మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2 కోట్ల 60 లక్షల మేర చలానాల అవకతవకలు జరిగినట్లు కృష్ణాజిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర రామారావు తెలిపారు. మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉపేంద్ర రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. 2019 అక్టోబర్ నెల నుంచి 2021 జులై 31 వరకు నిర్వహించిన తనిఖీల్లో సుమారు ఐదు వందల అరవై నకిలీ చలనాల ద్వారా సుమారు రెండు కోట్ల 60 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు ఆయన చెప్పారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి నోటీసులు జారీ చేసి.. లిఖిత పూర్వకమైన సమాధానం తీసుకుంటామని ఉపేంద్ర రామారావు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను తెలియజేయాలని ఆయన సూచించారు. అవినీతి జరిగిన ప్రతి రూపాయి వెనక్కి తీసుకు వస్తామని.. అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదని, అవకతవకలపై ఇప్పటికే పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు రిజిస్ట్రార్ రామారావు చెప్పారు.