కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో 3వ ఏడాది చదువుతున్న కోట శంకర్ అనే వ్యక్తికి ఫేస్బుక్లో సంపత్, జితేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. కొద్ది రోజులు స్నేహపూర్వకంగా ఛాటింగ్ చేశారు. ఈ క్రమంలో 30వ తేదీ కలుద్దామని గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోకి రమ్మన్నారు. అనంతరం అతడిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించారు.
CHEATING: ఫేస్బుక్ స్నేహం.. కలుద్దామని దోచుకున్నారు - గన్నవరంలో ఫేస్ బుక్ స్నేహం పేరుతో మోసం
ఫేస్ బుక్లో పరిచయం అయ్యారు... మిత్రుడిలా మాటలు చెప్పారు... స్నేహపూర్వకంగా కలుద్దామని పిలిచారు. ఆపై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. నగలు, చరవాణి దోచుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ ఘటన జరిగింది.
cheating
శంకర్ ఒంటిపైనున్న మూడు కాసుల బంగారు ఉంగరం, సెల్ ఫోన్ దొంగిలించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసరపల్లి సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు నగదు కోసం దోపిడీ చేశారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ..GRMB MEETING: అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం: ఏపీ ఈఎన్సీ