ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో ఆరు నెలలు తిరుమలలో సమ్మెలు నిషేధం - Tirumala News

తితిదేలో ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు, సమ్మెలపై వచ్చే ఏడాది మే 23 వరకు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఈ నెల 23 తో ముగియనున్నాయి.

మరో ఆరునెలలు తిరుమలలో సమ్మెలు నిషేధం
మరో ఆరునెలలు తిరుమలలో సమ్మెలు నిషేధం

By

Published : Nov 16, 2020, 7:39 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు, సమ్మెలపై మరో 6 నెలల పాటు నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెల 23 తో ముగియడంతో మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

వచ్చే ఏడాది మే 23 వరకు నిరసనలు, సమ్మెలపై నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కోంది. గతంలో తితిదే ఉద్యోగులను ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగానే తిరుమలలో సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం మరోమారు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సప్తగోకులం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details