అతి వేగం, నిర్లక్ష్యం, భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల అనార్థాలు జగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. వేగంగా వెళ్తున్న సమయంలో వాహనం అందుపులోకి రాక జరిగే ప్రమాదాల్లో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వివరించారు. జాతీయ రహదారులపై సరైన సూచికలు ఏర్పాటు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రమాదాల నివారణకు ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నామని... మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రమాదాల నివారణ... ప్రతీఒక్కరి బాధ్యత - అతి వేగం
ఒక్కరి నిరర్లక్ష్యం... వందలాది కుటుంబాల్లో విషాదం నింపుతోంది. రెప్పపాటులో చేసే పొరపాట్లు ఎన్నో నిండుప్రాణాలు బలితీసుకుంటున్నాయి. తప్పెవరిదైనై... ఆఖరికి నష్టపోయేది సామాన్యులే. రోడ్డు ప్రమాదాలకు కారణాలు... నివారణ చర్యలపై పలువుర తమ అభిప్రాయాలు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని చెబుతున్నారు.
ప్రమాదాల నివారణ... ప్రతీఒక్కరి బాధ్యత