ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజానాడి తెలుసుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ విఫలం: సీఎం - ఎగ్జిట్ పోల్స్

ఎగ్జిట్ పోల్స్​పై సీఎం చంద్రబాబు స్పందించారు. వాస్తవాలకు విరుద్ధంగా సర్వేలు ఉన్నాయన్నారు. ప్రజానాడిని తెలుసుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని స్పష్టం చేశారు.

ప్రజానాడి తెలుసుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి: సీఎం

By

Published : May 19, 2019, 11:37 PM IST

దిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ఎగ్జిట్ పోల్స్​పై తనదైన శైలిలో స్పందించారు. ప్రజానాడి తెలుసుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. గతంలోలాగానే వాస్తవాలకు విరుద్ధంగా తప్పులు సర్వేలు ఇచ్చాయన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని... ఇందులో ఏ అనుమానమూ లేదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో భాజపాయేతర పార్టీలే ఎక్కువ సీట్లు సాధిస్తాయని తెలిపారు. 50 శాతం vv పాట్లు లెక్కించాలనే డిమాండ్​పై తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. Vv పాట్లు ,ఈవీఎంలలో ఏ తేడా ఉన్నా ఆ నియోజకవర్గంలో అన్ని వీవీ పాట్లు లెక్కించాల్సిందేనన్నారు.

ABOUT THE AUTHOR

...view details