ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాత్కాలిక సిబ్బంది నియామకాలకు అనూహ్య స్పందన - latest updates of corona

జిల్లాలోని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో తాత్కాలిక వైద్య సిబ్బందిని నియమించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వడంతో... అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.

exercise for the appointment of temporary staff in govt hospitals in krishna district
exercise for the appointment of temporary staff in govt hospitals in krishna district

By

Published : Apr 7, 2020, 12:36 PM IST

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా.....ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది.

విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కౌంటర్​కు దరఖాస్తులు సమర్పించేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకుండా....అర్హతల వారీగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను డ్రాప్ బాక్స్​లో వేసేలా ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, సహాయకులు, ఆప్తాల్మిక్ సహాయకులు, స్టెరిలైజేషన్ సిబ్బంది, వెంటిలేటర్ టెక్నీషియన్లు, ఐసీయూ నర్సులు... ఇలా పలు విభాగాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత....అభ్యర్థుల చరవాణికి ఎంపిక సమాచారాన్ని అందించనున్నారు. 3 నెలల పాటు వైద్య సేవలు అందించేలా వీరిని తీసుకోనున్నామని.... జీతభత్యాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అందిస్తుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details