ప్రజావేదిక కూల్చిన రోజే జగన్ ప్రజాదరణ పోగొట్టుకున్నారని మాజీ ఎంపీ మాగంటి బాబు మండిపడ్డారు. జగన్ మరో జన్మెత్తినా పోలవరం పూర్తిచేయలేడన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు మాగంటిబాబు ఆయన నివాసంలో లాంతరు వెలిగించి నిరసన తెలిపారు.
ప్రజావేదిక కూల్చిన రోజే ప్రజాదరణ కోల్పోయారు - సీఎంపై మాజీ ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యాలు
తెదేపా నేతల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు మాజీ ఎంపీ మాగంటిబాబు తన నివాసంలోనే లాంతరు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ మాగంటి బాబు
అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, చింతమనేనిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం వద్ద కాగడాలతో నిరసన తెలిపి... అచ్చెన్నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి