దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ వంటి సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ప్రధాని అప్పగించారని విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు సైతం కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోకి వెళ్లిపోతాయన్నారు.ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఇచ్చే సెంటు స్థలం సరిపోదని వ్యాఖ్యనించారు.
నూతన వ్యవసాయ బిల్లులతో రైతుల మనుగడ ప్రశ్నార్థకం!
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యయసాయ బిల్లులతో రైతులకు ఇబ్బందులు తప్పవని మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్