ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లోడ్ ఎక్కువైతే 40వేలు ఫైనా.. వైకాపాది తుగ్లక్ పాలన' - pasupu chaitanyam latest news update

రాష్ట్ర ఖజానా కోసం వివిధ రూపాలలో సామాన్య, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల వారి పై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపడం సరైన పద్ధతి కాదని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. తెదేపా నాయకులతో కలిసి ఆమె విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ex MLA Tangirala sowmya pasupu chaitanyam
తెదేపా నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసన

By

Published : Nov 5, 2020, 2:26 PM IST

వాహనదారులపై భారీ పెనాల్టీలు వేయడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెదేపా నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాన్యుడి నడ్డి విరుస్తూనే ఉందని తంగిరాల సౌమ్య విమర్శించారు. రోడ్లు నిర్మాణ పనులు చేపట్టకుండానే వాహనదారులపై భారీ జరిమానాలు విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమైందన్నారు. వాహనం బరువు చెకింగ్ పేరుతో 40 వేల రూపాయలు ఫైన్​లు వేయడంపై ఆమె మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ పర్మిట్ లేకుంటే 10 వేలు రూపాయల రుసుం వసూలు చేయడం తుగ్లక్ పాలనని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details