నందిగామ నియోజకవర్గంలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నగర పంచాయతీ కార్యాలయంలోని కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అకాల వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి... వార్డులలో దోమల బెడద ఎక్కువైందని తెలిపారు. వారం రోజుల నుంచి పందులు, కుక్కలు వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నాయని పేర్కొన్నారు. సత్వరమై పారిశుద్ధ్యానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. గ్రామాల్లో, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
'అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి' - నందిగామ నియోజకవర్గం తాజా వార్తలు
నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అకాల వర్షాల వలన అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నగర పంచాయతీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి.. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
!['అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి' ex mla tangirala soumya given letter to panchayat commissioner in nandigama to take actions on sanitary works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8503372-344-8503372-1598009319033.jpg)
నగర పంచాయతీ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే తంగిరామ సౌమ్య వినతిపత్రం