అకాల వర్షాల వల్ల కృష్ణాజిల్లా వీరులపాడులో నీట మునిగిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. మండలంలోని జుజ్జూరు, అల్లూరు, దొడ్డ దేవరపాడు, పల్లంపల్లి, కొణతాల పల్లి, వెల్లంకి, నందలూరుల్లో పర్యటించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు.
మండలంలోని వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు వానల ధాటికి నాశనమయ్యాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో తిరిగి అధికారులు పంటనష్టాన్ని అంచనా వేయాలని కోరారు. అన్నదాతలను పూర్తిస్థాయిలో ఆదుకుని.. వారికి పరిహారం అందచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.