ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల స్థలాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు' - బోడె ప్రసాద్ తాజా వార్తలు

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటూ కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి రూ. 50 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

ex mla bode prasad criticise mla parthasaradhi about house sites
బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే

By

Published : Aug 20, 2020, 4:21 PM IST

పేదల ఇళ్ళ స్థలాల పేరుతో కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి రూ. 50 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. ఆ భూములను మెరక చేయడానికి మరో రూ. 100 కోట్ల అవినీతి చేశారన్నారు. పెనమలూరులో ఇళ్ల స్థలాల అవినీతిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు.

రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పేరుతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తీవ్ర విమర్శలు చేశారు. పేద ప్రజలకు అందాల్సిన సొమ్మును అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 50 కోట్ల అవినీతి జరిగిందన్న అయన.. ఇళ్ల స్థలాలకు రోడ్లు, మంచి నీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు లేకుండా స్థలాలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఓటు బ్యాంకు కోసమే ఈ నాటకాలాడుతున్నారంటూ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details