ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూముల కొనుగోలులో భారీగా అవినీతి: బోడె ప్రసాద్ - బోడె ప్రసాద్ తాజా వార్తలు

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్లస్థలాల కోసం భూముల కొనుగోలులో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆరోపించారు. అవినీతి చేయలేదని తిరుమల వేంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయాలని పార్ధసారధిని డిమాండ్‌ చేశారు.

ex mla bode prasad alligations on mla parthasarathi
బోడె ప్రసాద్, తెదేపా నేత

By

Published : Aug 31, 2020, 8:14 PM IST

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్లస్థలాల కోసం భూముల కొనుగోలులో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే పార్ధసారధి... తనకు భూముల నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదని మీడియా సమక్షంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు. తాము చేసిన అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పకుండా తెదేపాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పార్థసారధి అవినీతిపరుడని... వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

తన గురించి, తమ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. అవినీతి చేయలేదని తిరుమల వేంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయాలని పార్ధసారధిని డిమాండ్‌ చేశారు. ఎస్సీలపై ప్రేమ ఒలకబోస్తున్న ఎమ్మెల్యే- వారికి ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాను ఎకరా 50 సెంట్ల భూమిని తన కుమార్తెకు కట్నంగా ఇచ్చానని... అంతకంటే ఒక్క ఎకరా వ్యవసాయ భూమి ఉన్నా పేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

ABOUT THE AUTHOR

...view details