డాక్టర్ రమేశ్ ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం నజరానా ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు తీసే హంతకుల ఆచూకీ చెప్తే ప్రకటించే నజరానాను.. ప్రాణాలు కాపాడే వైద్యుల ఆచూకీ కోసం ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్ రమేశ్‌ను వేధిస్తున్నారన్నారు. ఇలా చేస్తే వైద్యుల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు.
'వైద్యుడి ఆచూకీ కోసం నజరానా ప్రకటించడమా!' - మజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
డాక్టర్ రమేశ్ ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం నజరానా ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఇలా చేస్తే వైద్యుల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు.
బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే