ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతాంగాన్ని ఆదుకోవాలని దేవినేని ఉమ డిమాండ్

By

Published : Dec 11, 2020, 9:45 PM IST

పత్తి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయినా.. ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. కృష్ణా జిల్లా కంచికర్ల మండలం గండేపల్లిలో.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. వ్యవస్థలన్నిటినీ చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు.

devineni uma and tangirala sowmya visit damaged crops
పంటలను పరిశీలించిన దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లిలో తుపాను వల్ల దెబ్బతిన్న పొలాలను.. మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. గ్రామాల్లో పరిస్థితిని చూస్తుంటే.. ఏ పంటా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ ద్వారా పత్తి సేకరణకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదన్నారు. రూ. 5,800 పలకాల్సిన పంట.. 3 నుంచి 4 వేల రూపాయలకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 నుంచి 15 బస్తాల ధాన్యమూ చేతికి వచ్చే అవకాశం లేదన్నారు. రైతులు 20 నుంచి 30 వేల రూపాయల వరకు పొలం మీద పెట్టి నష్టపోయి బాధలు పడుతుంటే.. అన్ని గ్రామీణ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేశారని ద్వజమెత్తారు. పంపు సెట్లకు మీటర్లు బిగించి అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు. మనిషి బతికి ఉండగా బీమా వస్తుందా చనిపోయాకా అని ప్రశ్నించారు.

రైతు భరోసా కేంద్రాలకు వెళ్లమని గొప్పగా చెప్తున్నారు కానీ.. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు నాసిరకం కావడం వల్ల పంట మొత్తం తాలుకాయలు వచ్చాయని ఉమా విమర్శించారు. వరి కోతకు ఈరోజు రూ.10 వేలు లేకుండా యంత్రం పొలంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. గతంలో వ్యవసాయ అనుబంధ విద్యార్థుల ద్వారా రైతుల సమస్యలను తెలుసుకుని.. సంబంధిత ఏవోకి చెప్పి పరిష్కరించే వాళ్లమని గుర్తు చేశారు. ఇప్పుడు గ్రామ వాలంటీర్ల దగ్గరకు, సచివాలయం వద్దకు వెళ్లమంటున్నారని ఆరోపించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details