పేకాట, గంజాయి అమ్మకాలు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అనుచరుల కనుసన్నల్లోనే సాగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని.. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు భయపడుతుందో అర్థం కావటం లేదన్నారు. మంత్రి కొడాలి నాని కనుసన్నల్లో వారి అనుచరులు విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని కొల్లు విమర్శించారు. రాష్ట్రాన్ని పేకాటాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
'స్థానిక ఎన్నికలకు వైకాపా ఎందుకు బయపడుతోంది?' - today ex ministers kollu ravindar comments
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అడుగడుగునా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అనుచరుల కనుసన్నల్లోనే ఇలాంటి అక్రమాలు జరగుతున్నాయని ఆరోపించారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర