ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారు: తెదేపా

వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారని తెదేపా నేతలు విమర్శించారు. కరోనాతో సహజీవనం చేయాలన్న వారే... ఇప్పుడు కొవిడ్ కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడిందనడం విడ్డురంగా ఉందని మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా ఎద్దేవా చేశారు.

ex ministers devineni uma and ayyannapatrudu fires on government on house sites distribution
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారని ఎద్దేవా చేసిన తెదేపా నేతలు

By

Published : Jul 7, 2020, 10:33 AM IST

కరోనాతో సహజీవనమన్న సీఎం జగన్‌.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. కార్యక్రమం వాయిదాకు కరోనాను కారణంగా చూపడం విడ్డూరంగా పేర్కొన్నారు. ప్రక్రియలో అక్రమాల జరిగాయని సొంత పార్టీ వారే విమర్శలు చేస్తున్నారన్నారు. అయినా సీఎంకు కనువిప్పు కలగడం లేదని విమర్శించారు.

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారని ఎద్దేవా చేసిన తెదేపా నేత అయ్యన్నపాత్రుడు

తెదేపా హయాంలో 25లక్షల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి, 10 లక్షలు పూర్తి చేశామని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. "సెంటు పట్టా" పేరుతో భూముల కొనుగోలు, స్థలాల చదును, పట్టాలలో వైకాపా నాయకులు అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల్లో సొంతపార్టీ నేతల అవినీతిపై విచారణకు ఆదేశించగలరా అని ప్రశ్నించారు.

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారని ఎద్దేవా చేసిన తెదేపా నేత దేవినేని ఉమా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details