బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీ కేశినేని నానిని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కలిశారు. ఇప్పటికే వసంత నాగేశ్వరరావు కుమారుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనేక విషయాల్లో తండ్రి నిర్ణయాలను విభేదించారు. అమరావతి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వసంత నాగేశ్వరావు తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు.. ఆయనకు, తనకు సంబంధం లేదంటూ అప్పుడు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కొట్టి పారేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వసంత నాగేశ్వరరావు ఎంపీ కేశినేని కలవడం సంచలనంగా మారింది. రాజకీయంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కలయికలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని కేశినేని నాని అంటున్నారు.
బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామం.. కేశినేని నానితో వసంత నాగేశ్వరరావు భేటీ - ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
vasanta nageswara rao
22:25 January 09
రాజకీయ ఊహాగానాలు