రాజధాని అమరావతి పై బాధ్యత గల మంత్రులు కేవలం ఒక సామాజిక వర్గానికి లాభం చేకూరేలా ఉందనడం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం లేదని.. అమరావతిని సహజంగానే నిర్మించవచ్చని తెలిపారు. ఇప్పటికే అమరావతిలో సచివాలయం ,అసెంబ్లీ, ఇతర శాఖలు కొలువుదీరి ఉన్నాయని చెప్పారు . వాటిని కొనసాగిస్తూ ఖర్చు లేకుండా పరిపాలన చేయవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి మంచి అవకాశాలున్నాయని అన్నారు . దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వంశధార, నాగావళి ప్రాజెక్టులను పూర్తి చేస్తే వలసలు తగ్గుతాయన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని...రాజధానిగా మాత్రం అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
'అమరావతిపై మంత్రుల వ్యాఖ్యలు సరికాదు'
అమరావతిపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరావు తప్పుబట్టారు. కేవలం ఒక సామాజిక వర్గానికే లాభం చేకూరేలా ఉందనడం సబబు కాదన్నారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
TAGGED:
EX_MINISTER_VADDE_ON_CAPITAL